మాలలు ఎవరు? మాల అనే పదం ఎలా వచ్చింది? మాలలు రాజ్యపాలకులా?
History of Mala Caste/Malla Yodhula Charitra/How did the word Mala come about
'మాల' అనే కులం 'మల్ల' అనే పదం నుండి వచ్చింది. పల్లవుల కాలంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన 'మల్లయుద్ధం' సృష్టించిన మహాయోధులు మల్లలే నాటి 'మల్ల' నేటి వాడుకలో 'మాల'గా మారింది. 'మల్ల' యోధులు మహాయోధులుగా రాజ్యపాలన చేసి తరువాతి కాలంలో యుద్ధంలో నష్టపోవడం వల్లన ముస్లిం రాజులు శత విధాలుగా ప్రయత్నాలు చేసి సమాజానికీ దూరంగా ఉంచారు. లేకపోతె మాలలు ఎక్కడ తిరగబడి రాజ్యాన్ని పాలిస్తారో అని భయం వారిని తరిమింది. అలా నష్టపోయిన 'మల్ల' వారు నైపుణ్యమైన వస్త్రాల తయారీ దారులుగా, గ్రామ రక్షక భటులుగా, కావలి కారు, నీరాటి గాలు చివరిగా 'మాల' వారుగా మారి అనంతరం అంటరానివారు గా మారారు.
పల్లవుల కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ 'మల్లయుద్ధం'లో శిక్షణ ఇచ్చి తరువాతి తరాలకు అందించటానికి విశేష కృషి చేశారు. దీన్ని మాలల స్వర్ణయుగంగా చెప్పవచ్చు. ఆ కాలంలో 'మల్లయుద్ధం'లో వీరిని ఓడించేవారేలేరు, మనసులు మలినం పడిన రోజున ఓర్వలేని వారు చేసిన తప్పుల వలన అణగారిన వర్గాలు ఏర్పడడానికి దారితీసింది.
అంతే కాదు అణచివేయబడకుంటే ఎక్కడ రాజ్యాధికారం చేపడతారో అనే భయంతో ఆర్థికంగా, అసమానతలతో ఉద్దేశ పూర్వకంగా అట్టడుగు స్థాయికి తొక్కేసారు. లేకపోతే మాలలు రాజులుగా వెలుగొందేవారు. అదే సమయంలో చాలా కులాల వారిని అణచివేసి అణగారిన వర్గాలు ఏర్పడడానికి కారణం అయ్యారు. దీన్ని అప్పటి నుండి అలాగే కొనసాగిస్తూ వచ్చారు. అప్పటి సమాజంలో ఈ నీచపు దురహంకారానికి చాలా వృత్తుల వారు బలయ్యారు. ఆ వృత్తులే కుల వృత్తులుగా మారాయి. ఇవే సమాజంలో అసమానతలు ఏర్పడడానికి దారితీసింది.
ఒక్క ముస్లిం ప్రాంతంలోనే కాకుండా దాదాపుగా అన్ని ప్రాంతాలలో వారిని ఊరిబయట ఉంచి తోట మాలిగాను, పాలేరులు గాను పెట్టుకొని వారి శరీర దారుడ్యాన్ని శారరక శ్రమ కోసం ఈ సమాజం వాడుతూ వచ్చింది.
యుద్ధ కళల యందు నిష్ణాతులై, శారీరిక బలవంతులైన వీరి చేతికి రాజ్యాధికారం చిక్కితే అధికారం మరొకరు చేజిక్కించుకోవటం అసాధ్యమే అవుతుంది కనుక వీరిని దురుద్దేశ పూర్వకంగానే బలహీన పరచి ముందు జాగ్రత్తగా, తెలివిగా ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం లేకుండా చేసి, ఏదోఒక కారణంగా ఏదోఒక తప్పును అంటగడుతూ ఆ ఊరికి ఆ రాజ్యానికి వెన్నుదన్నుగా నిలిచిన వారిని ఏదో ఒక కుంటి సాకులతో ఒక్కొకరినీ ఊరికి దూరంగా పంపుతూ వాళ్ళలో వాళ్ళకు సమైక్యత లేకుండా విభేదాలు సృష్టిస్తూ వర్గాలుగా విడగొట్టి తమ కోసం శారీరక శ్రమ చేయించుకోవడానికి మాత్రమే వినియోగించుకున్నారు.
గతంలో ఈ మల్లయోధుల నైపుణ్యాలకు భయపడి భవిష్యత్ లో వీరు రాజ్యాధికారానికి రాకూడదనే ఉద్దేశ పూర్వకంగా ఊరికి దూరంగా పెట్టారు. వారి సంకల్పం ఇప్పటికీ నిరంతరాయంగా కొనసాగేటట్లు చేసారు.

