మాల కులం - చారిత్రక వీరత్వం
మాలల వీరబాహుడు చరిత్ర
మాల కులం అత్యంత ప్రాచీన కులాలలో ఒకటి. ఒకప్పుడు పాలకులుగా జనరంజక పాలన చేసిన మాలల ప్రస్తుత స్థితికి కారణాలు, శోధించే ముందు. మాలల ప్రస్థావన ఉన్న చారిత్రక ఆధారాలు అన్నీ శోధించాల్సిన అవసరం ఉంది.
వీర శైవ విప్లవానికి స్ఫూర్తినిచ్చిన మాల "వీరబాహుడు"
వీరబాహుని గురించి కొత్తగా పరిచయం చెయ్యల్సిన అవసరం లేదు. ప్రసిద్ధ పౌరాణిక గాథ రాజా హరిశ్చంద్ర లో విశ్వామిత్రునికి బాకీ తీర్చడానికి, హరిశ్చంద్రుడు తనను తాను అమ్మకానికి పెట్టుకున్నప్పుడు, ఏనుగుని కప్పేసేటంత బంగారం ఇచ్చి, అయోధ్య రాజు హరిశ్చంద్రుడిని కొనుక్కున్న కాటికాపరి వీరబహుడు.
స్కంద పురాణంలో వీరబహుడు
వీరబహుడు కర్ణాటక ప్రాంతపు మాల హోలియ కులస్థునిగా చెప్పబడ్డాడు. కాశీలో ఇప్పటి హరిశ్చంద్ర ఘాట్ గా చెప్పబడే ప్రాంతం మొదట హోలియ కులస్థుల ప్రదేశముగా ఉండేది. శైవంలో మాల హోలియ కులానికి విశిష్టమైన స్థానం ఉన్నది. మాల హోలియ కులం, శివుని గణ రక్షణలో ఉన్నట్టు, శివుని కొడుకు మురుగన్ దళంలో సైన్యాధ్యక్షులుగా ఉన్నట్టు చెప్పబడింది. వీరు గొప్ప వీరులుగా శైవ సాంప్రదాయ వాఙ్మయం చెబుతుంది. ఇదే వీరబాహుడు మురుగన్ సైన్యం తరపున సురపద్మ రాజు మీద యుద్ధం చేయడంలో కీలక పాత్ర పోషించినట్టు శివ పురాణాల్లో కీలకమైన "స్కంద పురాణం"లో చెప్పబడింది. శివుని మీద భక్తితో వీరబహుడు తరువాతి కాలంలో కాశీ క్షేత్రంలో శివుని సేవకు అంకితం అయినట్టు చెప్పబడింది. శైవ సాంప్రదాయంలో అత్యంత కీలకమైన "నాగ సాంప్రదాయం"లో కూడా మాల హోలియ కులస్థుల పాత్ర చాలా కీలకమైనది.
ఆ వీరబాహుని స్పూర్తితో "రాజా హరిశ్చంద్ర" పౌరణిక కథలో వీరబాహుని పాత్ర సృష్టించబడినది అని చెప్పవచ్చు. ఈయన పాత్ర, మాల హోలియ కులపు ప్రత్యేకత అయిన వైష్ణవ ధర్మాలకు వ్యతిరేకంగా నిలబడే ధోరణి చూడవచ్చు.
వైష్ణ ధర్మం, కుల వ్యవస్థపై విరుచుకుపడ్డ మాల హోలియ వీరబాహుడు
రాజా హరిశ్చంద్ర గాథలో 11 వ భాగంలో, హరిశ్చంద్రుడిని కొన్న తరువాత హరిశ్చంద్రుడికి వీరబాహుని మధ్య జరిగే సంభాషణ వర్ణ వ్యవస్థను, కులవ్యవస్థను నగ్నంగా నిలబెడుతుంది. సూర్యవంశం రాజు అయిన నేను, ఒక అంటరాని కాటికాపరి అయిన నీవు చెప్పినట్టు నడుచుకోవాలా అని హరిశ్చంద్రుడు ప్రశ్నించినపుడు, వీరబహుడు అనాగరిక వివక్షను, వైష్ణవ ధర్మంలో అసమానత్వాన్ని చీల్చి చండాడతాడు.
వీర శైవ మతం / లింగాయత్ మతం ఆవిర్భావానికి దారి తీసిన వీరబాహుని స్ఫూర్తి
లింగాయత్ మత స్థాపకుడు అయిన "బసవన్న" మీద మాల హోలియ వీరబాహుని ప్రభావం ఉన్నది. వైష్ణవ మతం, వేద వాఙ్మయానికి వ్యతిరేకంగా బసవన్న ఉద్యమం చేయడం వైపు బసవన్న గారిని నడిపించింది వీరబాహుని ఘట్టం. అది చివరకు వైష్ణవ మత పునాదులను కదిలించివేసింది. వైష్ణవ మత కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయిన శైవాన్ని, బయటకు లాగి మళ్లీ శుద్ధి పరిచే వైపుగా కృషి చేయడానికి మాల హోలియ వీరబాహుని స్ఫూర్తి అధికంగా పనిచేసింది అని కన్నడ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత కెవెంపు (కుప్పలి వెంకటప్ప పుట్టప్ప) గారు అభిప్రాయపడ్డారు.
మాలలు ఎప్పుడూ ఉద్యమ గురువులు
హరిశ్చంద్ర గాథలో నిజాన్ని చెప్పడానికి భయపడేవాడు మాలవాడు కాలేడు అని రచయిత వీరబహునితో పలికిస్తాడు. మాల కులానికి ఆ కాలంలో ఉన్న గౌరవానికి సంకేతం వీరబాహుని పాత్ర. కర్ణాటక చరిత్రలో అతి ప్రతిష్టాత్మకమైన లింగాయత్ ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చింది మాల కులస్థులు ఇచ్చినదే అనే విషయం మాలలకు గర్వకారణం.
శైవ సాంప్రదాయంలో శివుని రక్షకులుగా, భైరవులుగా, భేతాలూరుగా, మాలల వీరత్వం నిక్షిప్తం అయ్యి ఉన్నది. మాలలు తమ గొప్ప వీరత్వ చరిత్రను తప్పక తెలుసుకోవాలి.
