అంబేద్కర్ మనుస్మృతిని ఎందుకు తగల పెట్టాడు
అంబేద్కర్ మనుస్మృతిని ఎందుకు తగల పెట్టాడు
1927 వ సంవత్సరం డిసెంబరు 25 న డాక్టర్ బాబా సాహెబ్ బి ఆర్ అంబేద్కర్ మనుస్మృతి అత్యంత దుర్మార్గమైన, క్రూరమైన సిద్దాంతాలు కలిగి ఉన్నది అని భావించి తగల పెట్టాడు. తన తర్వాత తన స్నేహితుడు అయిన బ్రాహ్మణుడి చేత రెండవ వాడిగా తగల పెట్టించాడు.
మనుస్మృతి చేసిన తప్పులు ఏమిటి
1. విద్యా హక్కు:
వేలాది సంవత్సరాలుగా మన దేశంలో శూద్రులకు, దళితులకు, ఆదివాసీలకు , మహిళలకు విద్యాహక్కు లేకుండా మను స్మృతి చేసింది. ఈ నాలుగు వర్గాలను పీడిత వర్గాలు అని అందాము.
ఆనాటి విద్యాలయాల్లో గురుకుల ఆశ్రమాలలో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మాత్రమే చదువుకునే వారు. ఈ ముగ్గురిని ఆధిపత్య వర్గాలు అని అందాము.
2. ఆస్తి హక్కు:
పీడిత వర్గాలకు ఆస్తి కలిగి ఉండే హక్కు లేదు. ఉంటే ఎప్పుడయినా ఆధిపత్య వర్గాలు స్వాధీనం చేసుకునే హక్కు అట్టి పెట్టుకున్నారు.
3. మహిళలు:
తమ రాజ్యంలోని ప్రతి మహిళను క్షత్రియ రాజులు తమ స్వంత ఆస్తిగా భావించారు. తమ రాజ్యంలోని ఏ మహిళను అయినా ఎప్పుడు అయినా క్షత్రియులు, బ్రాహ్మణులు అనుభవించే హక్కు కలిగి ఉన్నారు.
ఇలాటి అనేక దుర్మార్గాలను స్మృతుల పేరుతో తమ రాజ్యాంగంగా ఆనాటి పాలకులు అమలు చేశారు. దీని ఫలితంగా
A) చాటుగా చదువుకున్న శూద్రుల నాలుకలు తెగ కోశారు, వేదాలు విన్న వారి చెవుల్లో సీసం కరగించి పోశారు. పురాణాలలో శూద్ర శంబూకుడు, సత్యకామ జాబాలి, ఏకలవ్యుడు, కర్ణుడు, చార్వాకులు మెదలయిన వారు అణచి వేయబడ్డారు.
B) మహిళలు అయితే వేలాది మంది అంతఃపురాలలో బంధించ బడ్డారు.
C) పీడిత వర్గాలు కూడపెట్టి సంపాదించిన ఆస్తులను దోపిడి దొంగల వలె దోచుకున్నారు.
D) ఆదివాసీలను వేట పేరుతో దాడి చేసి వారి నివాస ప్రాంతాల నుండి నిరంతరం తరిమి వేశారు
E) అనిత్య - అనాత్మ గురించి మరియు ప్రతి దానిని ప్రశ్నించమని బౌద్దం చెప్పింది. అలా చెప్పినందుకు వేలాది మంది బౌద్దులను కాల్చి చంపారు, గానుగులలో వేసి ఆడించారు.
“అందుకే మహాకవి శ్రీ శ్రీ పురాణాలలో , చరిత్రలో ఏమున్నది గర్వకారణం
అన్నార్తుల హాహాకారాలు, పీడితుల ఆక్రందనలు, మహిళలపైన హింస తప్ప” అని చెప్పాడు.
ఈ స్మృతుల అమలు ఫలితంగా మద్య యుగాలలో “సతి “అనేది మహిళలను సజీవ దహనం చేసే అమానుషంగా మారింది.
పీడిత వర్గాలు పెళ్ళి చేసుకున్న అమ్మాయిని మొదటి మూడు రాత్రులు అనుభవించే హక్కును బ్రాహ్మణులు కలిగి ఉన్నారు.
శీల రక్షణ పేరుతో పది సంవత్సరాలు కూడా నిండని బాలికలకు వృద్దులతో బాల్యవివాహాలు చేశారు.
రాజా రామ మోహన రాయ్, ఈశ్వర చంద్ర విద్యా సాగర్, మహాత్మా ఫూలే, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు మొదలయిన సామాజిక సంఘ సంస్కర్తల కృషి ఫలితంగా బ్రిటీషు ప్రభుత్వం ఈ దుర్మార్గాలను, అమానుషాలను చట్టాల ద్వారా రద్దు చేసింది. వీటిని రద్దు చేయించిన మహనీయులకు, రద్దు చేసిన బ్రిటీషు ప్రభుత్వానికి భారత ప్రజలు ఋణపడి వున్నారు.
అందుకనే అనేక సామాజిక దురాచారాలకు మూలంగా వున్న మనుస్మృతిని; పీడిత వర్గాలకు విద్యాహక్కు, ఆస్తి హక్కు ఇవ్వని మనుస్మృతిని మహిళలు కామ కేంద్రాలు అని, పురుషుడి నిగ్రహాన్ని చెడగొట్టేందుకు పుట్టించ బడిన వారని, స్త్రీ పురుషుడి పడక సుఖానికి, పిల్లలను కనడానికి, వంట ఇంటికి మాత్రమే పరిమితం కావాలని చెప్పిన మనుస్మృతిని తీవ్రమైన ఆగ్రహంతో మహనీయుడు అంబేద్కర్ 1927 డిసెంబర్ 25 న మహద్ పట్టణంలో తగల పెట్టాడు.
తాను రాసిన భారత రాజ్యాంగంలో పీడితులకు
1. విద్యా హక్కు
2.ఆస్తి హక్కు
3. మహిళలకు అనేక హక్కులు కల్పించాడు.
పై విషయాల పట్ల తన నిబద్దతను చాటుకున్నాడు. మన దేశ ప్రజా స్వామిక విప్లవానికి అంబేద్కర్ పునాదులు వేశాడు.
అంబేద్కర్ స్ఫూర్తిని మనం తీసుకోవాలి. తన భావజాలం కలిగిన బ్రాహ్మణుడిని కూడా తన కార్యక్రమాలలో భాగస్వామ్యం చేసిన అంబేద్కర్ ఆచరణను మనం గమనించాలి. పుట్టుక ఏ ఒక్కరి చేతిలో వుండదు. ప్రగతిశీల భావజాలం ఏర్పరచుకోవడం అనేది తమ చేతిలోనే వుంది. అంబేద్కర్ ఆలోచనలను అంగీకరించే ఆధిపత్య కులాల నుండి వచ్చిన వారిని, మీరు ఆధిపత్య కులాల వారు అని కొందరు అంబేద్కర్ వాదులు ఛీదరించుకుంటున్నారు. అంబేద్కర్ సాహిత్యం మరియు ఫూలే సాహిత్యం వీరు చదవలేదని అర్ధం అవుతుంది. చదివిన వారికి స్పష్టంగా అర్ధం అయ్యే విషయం ఏమిటి అంటే వారిద్దరూ ఆధిపత్య భావజాలాలను, బ్రాహ్మణిజాన్ని, మనువాదాన్ని మాత్రమే తీవ్రంగా వ్యతిరేకించారు తప్ప ఏ ఇతర కులంలో పుట్టిన వ్యక్తులను కాదు. అంబేద్కర్ - ఫూలేలకు అనేక మంది బ్రాహ్మణ మిత్రులు ఉన్నారని వారి సాహిత్యం చదివితే అర్ధం అవుతుంది.
నేటి ఫాసిస్టు సంఘపరివార్ అగ్ర కుల పాలకులు మనుస్మృతిని నూతన రాజ్యాంగంగా తెచ్చే ప్రయత్నాలలో వున్నారు .
దానిని తిప్పి కొట్ట వలసిన బాధ్యత అంబేద్కర్ వాదుల మీదనే కాదు సమస్త వామపక్ష, బహుజన, ప్రగతిశీల, ప్రజాస్వామ్య శక్తుల మీద వుంది.
జేజేలు అంబేద్కర్ కు!
మనుస్మృతి నశించాలి!
మనుస్మృతిని రాజ్యాంగంగా మార్చే కుట్రలను తిప్పి కొట్టాలి!
జై భీమ్!
సనాతన ధర్మం అంటే ఏమిటి
సనాతన ధర్మం అంటే ఇప్పటికీ చాలా మందికి పూర్తిగా తెలియదు... ముఖ్యంగా శూద్రులైన కమ్మ కాపు రెడ్డిలకు అస్సలు తెలీదు. కానీ సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసుకుందాం.
1.సనాతన ధర్మం అంటరానితనం అని మీకు తెలుసా?
2. సనాతన ధర్మం పేరిట కట్టు బానిసలుగా వెట్టి చాకిరి చేయించేవారు అని మీకు తెలుసా?
3. సనాతన ధర్మం పేరిట ఊరికి దూరంగా వెలివేసారని మీకు తెలుసా?
4. సనాతన ధర్మం పేరిట ఒంటిమీద బట్ట కూడా లేకుండా చేశారని మీకు తెలుసా?
5. సనాతన ధర్మం పేరిట తినటానికి తిండి లేకుండా చనిపోయిన మృత కళేబారాలను తిని బ్రతకవలసి వచ్చిందని మీకు తెలుసా?
6.సనాతన ధర్మం పేరిట స్త్రీ ల ను వివక్షకు గురిచేసిందని మీకు తెలుసా?
7. సనాతన ధర్మం పేరిట బాల్య వివాహాలను జరిపించింది ప్రోత్సహించింది అని మీకు తెలుసా?
8. సనాతన ధర్మం పేరిట భర్త చనిపోతే భార్యను కూడా భర్త చితిమంటలో వేసి తగలబెట్టే వారని మీకు తెలుసా?
9. సనాతన ధర్మం పేరిట శూద్రుడు చదవకూడదని, చదివితే నాలుక కోస్తారని? చదువు వింటే చెవిలో సీసం పోసే వారిని మీకు తెలుసా?
10. సనాతన ధర్మం పేరిట శూద్రునికి భూమి కానీ, ఆస్థి పాస్తులు ఉండకూడదని కట్టు బానిస గానే జీవించాలని నీకు తెలుసా?
11.. దేవదాసి వ్యవస్థను పెట్టి ప్రోత్సహించింది సనాతన ధర్మం అని మీకు తెలుసా?
12. సనాతన ధర్మ పేరిట సముద్ర యానం నీవు చేయకూడదని నీకు తెలుసా?
13. సనాతన ధర్మ పేరిట కులాలను బట్టి శిక్షలు అమలు చేసేవారిని మీకు తెలుసా?
14. సనాతన ధర్మం పేరిట కులాలను బట్టి పురోహితులు ఇప్పటికీ మంత్రాలు చదువుతున్నది నిజం కాదా?
15. సనాతన ధర్మం ప్రకారం చావుల్లో కూడా కులాల పేరిట పురోహితులు సాంగ్యాలు నిర్వహించడం నిజం కాదా ఇలా చెప్పుకుంటా పోతే గంటలు సాలవు రండి తెలుసుకుందాం! చర్చించుకుందాం!!
//సనాతన ధర్మంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే చాతుర్వర్ణాలు ఉన్నాయి.
ఈ చాతుర్వర్ణ వ్యవస్థలో
1. బ్రాహ్మణులు జ్ఞాన సముపార్జన, శాస్త్రబోధన, మతవిధులను నిర్వర్తంచడం.
2. క్షత్రియుడు ఆయుధాలు ధరించి పరిపాలించడం,
3. వైశ్యుడు వ్యవసాయం, వ్యాపారం చేయడం
4. శూద్రుడు పై మూడు వర్ణాలకు సేవ విధిగా చేయాలి.
ఇది శ్రమ విభజన వ్యవస్థగా కొందరికి అనిపిస్తుంది. కాని ఈ వ్యవస్థలో శూద్రుడికి ఆస్తి హక్కు, వేదజ్ణానం, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం అన్నీ తిరస్కరించబడ్డాయి. కేవలం దాసుడుగా పై మూడు వర్ణాలకు సేవలు చేసి పొట్ట నింపుకోవాలి. ఆ విధంగా సేవలు చేసిన వానికే స్వర్గప్రాప్తి లభిస్తుందని బ్రాహ్మణులు శాస్త్రాలలో పేర్కొన్నారు.
ఈ సనాతనధర్మం, వర్ణవ్యవస్థ శూద్రుల పాలిట శాపాలుగా ఎలా పరిణమించాయో ఇంకా కొన్ని ఉదాహరణలు.
1. పై మూడు వర్ణాల పురుషులు శూద్రవర్ణం స్త్రీలను లైంగికంగా అనుభవించవచ్చు, పెళ్ళాడవచ్చు. అయితే పై వర్ణాల స్త్రీలతో లైంగిక సంబంధం గల శూద్ర పురుషుడి నేరం చేసిన అవయవాన్ని ఖండించాలి లేదా అతడికి మరణశిక్ష విధించాలి. (మనుధర్మశాస్త్రం 8: 374)
2. బ్రాహ్మణుడు కేవలం బ్రాహ్మణ కులంలో పుట్టిన కారణంగానే ధర్మ నిర్ణయం చేయగలడు. కానీ శూద్రులు ఎంత పాండిత్యం సంపాదించుకున్నా ఆ స్థానం చేరుకోలేడు. (మనుధర్మశాస్త్రం 8:20)
3. ఏ రాజు యొక్క రాజ్యంలో శూద్రులు ధర్మ నిర్ణయం చేస్తారో ఆ రాజ్యం ఊబిలో పడిన ఆవు వలే కుంగిపోతోంది. (మనుధర్మశాస్త్రం 8:21)
4. ఏ శూద్రుడైనా గర్వంతో ధర్మాన్ని ప్రవచించినా, విన్నా అతని నోటిలో, చెవులలో మసలుతున్న నూనె పోయించబడుతుంది. (మనుధర్మశాస్త్రం 8: 272)
5. శూద్రులకు విద్య గరిపిన బ్రాహ్మణులు, శూద్రుల వద్ద విద్యాభ్యాసం చేసిన బ్రాహ్మణులు శ్రాద్ధ కర్మల నిర్వహణకు అనర్హుడు. (మనుధర్మశాస్త్రం 3:156)
6. శూద్రుని సమక్షంలో వేదాలను పఠించరాదు. (మనుధర్మశాస్త్రం 4:99)
7. శూద్రుడు ఆస్తులు సంపాదించే శక్తి ఉన్నప్పటికీ, అతడు తన అవసరాలకు మించిన సొత్తును కలిగి ఉండరాదు. అలా సంపాదించి ధనాన్ని కూడబెట్టడం జరిగితే అతడు అహంకార పూరితుడై బ్రాహ్మణులను లక్ష్యపెట్టక పోవచ్చును. (మనుధర్మశాస్త్రం 10:129)
8. బ్రాహ్మణుడు తన జీవనానికి ఎలాంటి లోపం ఏర్పడినా సందేహించకుండా శూద్రుని వస్తు, సంపదలను స్వాధీనం చేసుకోవచ్చు. (మనుధర్మశాస్త్రం 8:417)
9. భగవంతుడు ఆదేశించినట్టుగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య జాతులను సేవించడమే శూద్రుల వృత్తి. (మనుధర్మశాస్త్రం 1:9)
10. బ్రాహ్మణులకు సేవకులుగా ఉండడమే శూద్రులకు తగిన వృత్తి. మరే పని కూడా దీనికి సాటిరాదు. (మనుధర్మశాస్త్రం 10:123)
11. బ్రాహ్మణుడు జీత భత్యాలతో నిమిత్తం లేకుండా శూద్రులతో సేవలు చేయించుకోవాలి. ఎందుకంటే బ్రాహ్మణులకు బానిసలుగా ఉండడానికే భగవంతుడు శూద్రులను సృష్టించాడు. (మనుధర్మశాస్త్రం 8:413)
12. ఎవరైనా శూద్రుడు ద్విజుణ్ణి (పైమూడు వర్ణాలను) దూషించినట్లయితే ఆ శూద్రుని నాలుక కత్తిరించబడుతుంది. ఎందుకంటే శూద్రులు అతి తక్కువ జాతి వారు కనుక. (మనుధర్మశాస్త్రం 8:270)
13. ద్విజుల (పై మూడు వర్ణాల) యెక్క పేర్లు, కులాలను తిరస్కరిస్తూ ప్రస్తావించిన శూద్రుల నోటిలో పది వేళ్ల పొడవు గల ఇనుప మేకును ఎర్రగా కాల్చి దూర్చాలి.(మనుధర్మశాస్త్రం 8:271)
14. బ్రాహ్మణుని పేరు సంతోషాన్ని గుర్తుకు తెచ్చేదిగా, క్షత్రియుల పేర్లు రక్షణకు మారు పేరుగా, వైశ్యుల పేర్లు వృద్ధిని చూపేదిగా ఉండాలి. శూద్రుల పేరు సేవక వృత్తిని చూపునట్లు ఉండాలి. (మనుధర్మశాస్త్రం 2:32)
15. బ్రాహ్మణుల ఇంటిపేరు శుభప్రదమైనదిగా, క్షత్రియుల ఇంటిపేరు శక్తిని చూపేదిగా, వైశ్యుల ఇంటిపేరు ధన సంపత్తిని సూచించేదిగా ఉండాలి. శూద్రుల ఇంటిపేరు హేయమైనదిగా ఉండాలి. (మనుధర్మశాస్త్రం 2:31)
సనాతనధర్మంలో - యజ్ఞయాగాలు
పూర్వం గోబలి లేని యజ్షయాగాలు ఉండేవి కావు. సువిశాలమైన యజ్ఞశాలలు నిర్మించి పురోహితుల మంత్రధ్వానాల మధ్య గోవధతో పాటు అనేక జంతుబలులు జరిగేవి. యజ్ఞంలో పాలు, ధాన్యాలు, నెయ్యి, మాంసం, సోమరసం దేవతలకు నైవేథ్యంగా నివేదన చేసిన తరువాత వేదబ్రాహ్మణులు సోమరసాన్నిమత్తుగా త్రాగి, బలిచ్చిన గోమాంసం భుజించేవారు. అందుకు సాక్ష్యం వారు నమ్మిన గ్రంథాల్లోనే రాయబడింది. ఇవే ఋజువులు.
1 - “ అధో అన్నం వాయ్ గోవా” – "వాస్తావానికి గోవు మన ఆహారం “. – (ఐతేరియ బ్రహ్మణ్యం: - 111.9.8 )
2 - “ మాంసం లేకుండా మధువును తీసుకోవడం సాధ్యం కాదు “ ( ఆశ్వలాయన గృహ్య సూత్రం: 1-4 )
3 - "పండితుడు , ప్రసిద్ధుడు , సామాజికుడు , శ్రోతలున్న వక్త , వేదపాటి , దీర్గాయుష్మంతుడు అగు పుత్రున్ని కనాలన్న కోరికగల తల్లి, ఆబోతు లేదా ఎద్దు మాంసం నేతితో వండుకొని తినవలయును." (బృహదారణ్యకం )
4 – “ వయస్సులో వున్న దూడ మాంసం కానీ , లేదా ముదురు వయస్సులో వున్న ఎద్దు మాంసం కానీ భుజించాలి “ (శంకారాచార్యులు)
5 – “ నా శరీరం మాంసమై ఉన్నంత వరకు నేను లేత ఆవు మాంసం తింటాను “. – ( యజ్ఞావల్కుడు - శతపద బ్రాహ్మణం )
6- భరద్వాజుడు ఒక అవుదూడను వధించి రాముడిని బోజనానికి ఆహ్వానించాడు ( రామాయణం )
7- ఎన్ని యజ్ఞాలు, యాగాలు చేసినా మాంసం తిననివాడు రాబోయే ఇరవై జన్మలు జంతువుగానే పుడతాడు. ( మనుధర్మ శాస్త్రం - 35 వ సూక్తం )
8 – ఇంట్లో ఎద్దు మాంసం తినొచ్చు , పాలు ఇచ్చే ఆవులను దూడలను బలి ఇవ్వచ్చు కానీ కటిక వానికి అమ్మకుడదు. ( కౌటిల్యుని అర్ధ శాస్త్రం )
9 – ఉత్తర క్రియలలో ( దశదిన కర్మ లో) భాగంగా ఆవునో, ఎద్ధునో వధించి బ్రాహ్మణులకు విందు ఇచ్చేవారు. (రుగ్వేదం 10 ,14 -1 )
10 – రంతి దేవుని వంట గదిలో ఆవును వధించి ధాన్యంతో పాటు మాంసం వడ్డించేవారు (అధర్వణ వేదం – 11.2, 4)
11 – ఇంద్రునికి , శివునికి గోవులు బలివ్వాలి , గర్భిని స్త్రీలు ఎర్ర ఆవు మాంసం తింటే పండంటి బిడ్డకు జన్మనిస్తారు. (యాజ్ఞవల్క స్మృతి)
మాలలపై ఎందుకీ కక్ష
Manda Krishna betrayed the Madiga Caste
మీ అందరికి తిండి, బట్ట, ఇల్లు, వైద్యం కల్పించడం ప్రభుత్వ విధి. ఒక్క మాటలో చెప్పాలంటే అంతా మీ అంగీకారంతో జరగాలి. ప్రాపంచికమైన అన్ని ఆనందాలకూ చట్టమే ఆనవాలు. శాసన నిర్మాణాధికారాన్ని చేజిక్కించుకోండి. అదే మీకు విమోచన మార్గం - డాక్టర్ బిఆర్. అంబేద్కర్
కేంద్రంలోని అధికార పార్టీ నవంబర్ 7, 2023 రోజున మాదిగ విశ్వరూప ‘ఎన్నికల ముసుగు’ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అంటే అన్ని కులాలకు సమానంగా ఉండవలసిందిపోయి ఒక వర్గానికి కొమ్ము కాయడం సిగ్గు చేటు. మరోపక్క 400 ఎంపీ సీట్లు ఇస్తే రాజ్యాంగాన్నే మార్చివేసి రిజర్వేషన్లనే తొలగిస్తామని కాషాయపు పార్టీ ఎంపీలు బహిరంగంగానే ప్రకటించారు. లక్షలాదిమంది సాక్ష్యంగా అదే పార్టీ అగ్రనేత కాళ్లుపట్టుకొని, అదే కాషాయపు పార్టీకి ఓట్లు వేయమనడం మంద కృష్ణ మాదిగకే చెందుతుంది. దళిత జాతి రిజర్వేషన్ హక్కులను తొలిగించాలనుకునే పార్టీకి ఓటువేయమనడం/ఓటువేయడం అనేది తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడంతో సమానం అవుతుంది. స్వలాభం కోసం రిజర్వేషన్ ఫలాలను తుడిచిపెడతానని బహిరంగంగా ప్రకటించిన వారికి ఓటు వేయమని చెప్పి తన మాదిగ జాతికే ద్రోహం చేసిన ఘనత అలానే తన జాతి నాశనానికి కారణం కాబొయ్యే మంద కృష్ణ మాదిగకే చెల్లుబాటు అవుతుంది.
1985 కారంచేడు ఊచకోతకు వ్యతిరేకంగా జరిగిన ఐక్య ఉద్యమ ఫలితంగానే 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం వచ్చింది. 1991 చుండూరు ఊచకోత సంఘటనలో ఐక్య ఉద్యమం అగ్రకులాలను దోషిగా నిలబెట్టింది. పైరెండు ఉద్యమాలు మాలల నాయకత్వంలో జరిగి, ఫలితంగా ఆంధ్ర అగ్రవర్ణాలకు మాలలు శత్రువులైనారు.
1994లో బీఎస్పీ అధినేత కన్షీరాం ఆంధ్ర మాలల సహకారంతో దక్షిణ భారతంలో తన రాజకీయ విస్తరణ చేస్తున్న రోజుల్లో ఆనాటి ఒంగోలు ఎంపీ మాగుంట సుబ్బిరామిరెడ్డి, పచ్చ జెండా అధ్యక్షుడు ఆంధ్ర మాలలతో వారికున్న వైరం కారణంగా బీఎస్పీని నిలువరించడానికి ఎమ్మార్పీఎస్ అండదండలు తీసుకోవటంతో మొదలుకొని, 2023 లో మాదిగ వ్యక్తి తన ఉన్నతోద్యోగం వదులుకొని బీఎస్పీ పగ్గాలు చేపట్టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే మాదిగలే ఓట్లేయని సందర్భం దాకా మాదిగల రాజకీయ, సామాజిక ద్రోహం అనేకమార్లు ఋజువైంది. ఎమ్మార్పీఎస్ ఏర్పాటు అనంతరం జరిగిన 1998 వేంపేట, 2012 లక్ష్మిపేట ఊచకోత సంఘటనల్లో దళిత ఐక్య ఉద్యమం నీరు కారడానికి మాలలతో మాదిగలు కలసిరాకపోవడమే కారణం. ఇలా సామాజిక, ఐక్య ఉద్యమాలకు ద్రోహం చేసిన చరిత్ర మాదిగలది.
మాలల వీరబాహుడు చరిత్ర
మాల కులం - చారిత్రక వీరత్వం
మాలల వీరబాహుడు చరిత్ర
మాల కన్నమదాసు చరిత్ర
వీర భయంకర మాల కన్నమదాసు చరిత్ర
మాల కులం - చారిత్రక వీరత్వం
మాల కులం పేరు - దాని అర్థం
మాల కులం పేరు - దాని అర్థం Name of the MALA Caste and its meaning
మాల అంటే కులం కాదు. మాల అనేది ఒక ప్రత్యేక జాతి.
జర్మన్ చరిత్రకారులు Gustav Solomon Oppert గారి అధ్యాయనం ప్రకారం, ద్రవిడ సంస్కృతి, ద్రవిడ చరిత్ర "మాల" అనే పేరుతో పెనవేసుకుని ఉన్నట్లు, తన పరిశోధనా గ్రంథం The Original Inhabitants of Bharata Varsha or India - The Dravidians (భారత దేశ అసలైన భూమి పుత్రులు - ద్రవిడులు) లో పేర్కొన్నారు..
పర్వత ప్రాంతం (హిమాలయాలు -సింధు లోయ - సింధు నాగరికత) నుండి వచ్చినవారిగా చెప్పబడే "మాలవ" అనే ఈ Proto-Dravidian జాతి ప్రజలను, భారత దేశం అంతటా, పర్వతానికి పర్యాయపదాలైన పేర్లతో పిలవబడ్డారు అని రాశారు.
ఆ విధంగా,, "మాల" అనే పేరు పర్వతానికి పర్యాయపదం అయిన "మలై" అనే పేరు నుండి వచ్చింది.. వీరినే మల్లార్/పరయా (పర్వత నుండి పరయా) అని, గంగా పరివాహిక ప్రాంతంలో మల్లలు అని, బెంగాల్ ప్రాంతంలో మాల్ లు అని, మేరు పర్వతం పేరుతో పడమరలో మార్లు అని, మహార్లు అని, భార్ లు అని పిలిచినట్టు, వీరే ద్రవిడ సాంస్కృతికి మూలాల అని Gustav Oppert పేర్కొన్నారు..
తమిళ సంగం సాహిత్యంలో కూడా వీరు శివుడి కుమారుడు మాల చెన్నప్ప వారసులు అని, వీరు కైలాస పర్వత నివాసులు కాబట్టి వీరికి పర్వతానికి తమిళ పదం "మలై" అనే పేరుతో "మాల" అనే పేరు వచ్చిందని చెప్పబడింది.. "నాగ" అనే జాతి పదానికి సంబంధించిన మూలాల శైవంలో ఎక్కువగా కనిపిస్తాయి..
మాలలు తమను తాము రెండు తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేసుకుని చూడకూడదు ..
తమిళ మాలలు:–పరయాలు (Name of the Tamil Mala Caste)
కన్నడ మాలలు:–హోలియాలు (Name of the Kannada Mala Caste)
కేరళ మాలలు:–పులయార్ లు (Name of the Malayali Mala Caste)
మహారాష్ట్ర మాలలు:–మహర్ లు (Name of the Marathi Mala Caste)
జనాభా మొత్తం కలుపుకుంటే ,, దక్షిణ భారతదేశంలో 28% తో అత్యంత జనాభా కలిగిన Single Caste మాలలు మాత్రమే .. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీన జాతి మాలలు. దక్షిణ భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది కూడా మాలలే.
మాల జాతి సాధించిన విజయాలకు ఉదాహరణ: మహారాష్ట్ర –మహర్ లు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్–భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, విశ్వ జ్ఞాని, సామాజిక విప్లవ యోధుడు, ఇండిపెండెంట్ లేబర్ పార్టీ వ్యవస్థాపకులు
బాబు L. N హరదాస్ - జై భీమ్ అనే నినాదాన్ని మనకు అందించి, బాబాసాహెబ్ ఉద్యమాన్ని ఇంటింటికి పరిచయం చేసిన ధృవతార.
కాశబా జాధవ్ – మల్ల యుద్ధ వీరుడు 1952 ఒలింపిక్స్ పథకం. స్వతంత్ర భారత దేశానికి మొట్ట మొదటి ఒలంపిక్ వ్యక్తిగత పధకం సాధించినవారు
తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ మాలలు కన్నమదాసు-అతి వీర భయంకర కత్తి యుద్ధ వీరుడు శత్రుసైన్యం ఎంత మంది ఉన్న గడగడలాడించే ధీరత్వం ఆయన సొంతం
భాగ్యరెడ్డి వర్మ - మొట్టమొదటి ఆది - ద్రవిడ ఉద్యమకర్త
బత్తుల వెంకట్రావు - నిజాం ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి - మొదటి Social Welfare సిద్ధాంతకర్త
కుసుమ ధర్మన్న - దక్షిణ భారతదేశంలో మొదటి దళిత విప్లవ కవి
ఓబలమ్మ- రోకలిని ఆయుధంగా చేసి హైదర్ అలీ సైనికుల నుంచి చిత్రదుర్గ కోటను కాపాడిన వీర వనిత
కత్తి పద్మారావు - దేశంలో దళిత ఉద్యమాలను కొత్త పుంతలు తొక్కించిన నాయకులు
దామోదరం సంజీవయ్య - భారతదేశ మొట్టమొదటి దళిత ముఖ్యమంత్రి , ఆంద్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రి
సర్దార్ నాగప్ప - రాజ్యాంగ పరిషత్తులో మాల నాయకులు - మొదటి దళిత MLA (కర్నూలు నియోజకవర్గం). రిజర్వేషన్లు 10 సంవత్సరాలకు మించి కొనసాగడానికి మూలకారణం.
బోయి భీమన్న - పద్మ విభూషన్, అది ద్రవిడ సిద్ధాంత రచయిత.
బొజ్జా తారకం - ప్రఖ్యాత సామాజిక హక్కుల ఉద్యమకారులు
జెట్టి ఈశ్వరీ బాయి - బాబాసాహెబ్ రిపబ్లికన్ పార్టీ మొదటి అధ్యక్షురాలు , రిపబ్లికన్ పార్టీ నుండి మొదటి మహిళా MLA
GMC బాలయోగి - భారత పార్లమెంటుకు మొట్టమొదటి దళిత స్పీకర్
ప్రతిభా భారతి - ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మొట్టమొదటి మహిళా స్పీకర్
మేకతోటి సూచరిత - ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిళా హోమ్ మంత్రి
లంకపల్లి బుల్లయ్య - భారతదేశంలోని యూనివర్సిటీలలో మొట్టమొదటి దళిత వైస్ ఛాన్సలర్ గడ్డం వెంకటస్వామి - కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షులు, నవభారత కార్మిక ఉద్యమ నిర్మాత, ప్రజల చేత కాకా అని ప్రేమగా, పిలిపించుకున్న నేత.
జలాది రాజారావు - తెలుగు సినిమా గేయకర్త
గోరేటి వెంకన్న - విప్లవ రచయిత, ఉద్యమాలను ఊపు ఊపే గాయకులు
గద్దర్–ప్రజా విప్లవ గాయకుడు ఉద్యమాలను ఊపు ఊపే గాయకులు
కాలేకురి ప్రసాద్–దిక్కార కవి సినీ గేయ రచయిత సమత విప్లవ రచయిత
అర్చన - రెండు సార్లు జాతీయ పురస్కారాలు పొందిన సినిమా నటి
మాధవి - జాతీయ ఉత్తమ నటి పురస్కారం పొందిన సినిమా నటి
జానీ లివర్ - బాలీవుడ్ కి హాస్యాన్ని నేర్పిన నటులు
ఉత్తర్ ప్రదేశ్ మాల– కోలీ(కోరి), మల్లహ్
ఝల్కారీబాయి కోరి–1857 సిపాయిల తిరుగుబాటు లో బ్రిటిష్ సైన్యంతో యుద్ధం చేసిన వీరవనిత. చిన్నప్పుడే కర్ర సాము, కత్తి సాము, గుర్రపు స్వారీ లాంటి యుద్ధ విద్యలు నేర్చుకుని ఒంటి చేత్తో చిరుతపులిని చంపడం, బందిపోటు దొంగల్ని తరిమి కొట్టడంతో వీరనారిగా పేరుతెచ్చుకుంది.
కేరళ మాల- పులియ కులం
అయ్యంకాలి - పులియ - మొదటి కేరళ ఉద్యమకర్త
P.K. రోసి - పులియ - మొదటి కేరళ హీరోయిన్
KR. నారాయణన్- భారతదేశానికి 10వ రాష్ట్రపతి
KG బాలకృష్ణన్- 35వ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్
తమిళమాల -పరయాలు
అయోతి దాస్ - మొదటి బౌద్ధ ఉద్యమకారులు
MC రాజా - దక్షిణ భారతదేశం నుండి మొదటి శాసన సభ్యులు , షెడ్యూల్డ్ Caste ఫెడరేషన్ బాబాసాహెబ్ కి అప్పగించిన నాయకులు
వేలుపిళ్ళై ప్రభాకరన్ - శ్రీలంక LTTE వ్యవస్థాపకుడు, తిరుమవలవన్ - దళిత చిరుత , విప్లవ చిరుతల కచ్చి ( VCK ) పార్టీ వ్యవస్థాపకులు
ఇళయరాజా - భారతీయ సంగీతాన్ని కొత్త పుంతలు తొక్కించిన విద్వాంసులు
రజనీకాంత్ - మహారాష్ట్ర మహార్ కులస్తులు, సూపర్ స్టార్ ప్రభుదేవా - నృత్య రంగంలో భారతదేశానికి వన్నె తెచ్చిన లెజెండ్
చియా విక్రమ్ - అపరిచితుడు సినిమాతో ప్రపంచ స్థాయి ఆదరణ పొందిన నటులు
విజయ్ జోసఫ్ - అత్యంత ప్రజాదరణ పొందిన తమిళ నటులు
ధనుష్ - తమిళ సినిమాని ప్రపంచ స్థాయికి నిలబెట్టిన నటులు
పా .రంజిత్ - నీలి విప్లవ దర్శకులు
యువన్ శంకర్ రాజా - ప్రఖ్యాత సంగీత దర్శకులు
లారెన్స్ రాఘవేంద్ర - నటులు, దర్శకులు
వీరుతో పాటు జాతిపరంగా సోదరులు అయిన మహారాష్ట్ర మహార్లను ఉత్తర్ ప్రదేశ్ కోలీలను మల్లలను మధ్య ప్రదేశ్ కోరీ లను, బెంగాల్ మల్ - పహాడియా లను కలుపుకుంటే ఈ దేశంలో అత్యంత జనాభా కలిగిన జాతి మాల జాతి. 297 జిల్లాల్లో విస్తరించి ఉన్న కులం - మాల కులం
Latest News
Popular Posts
-
Different Names of Mala Caste in India, Mala Caste other State names, History of Mala Caste, Malla Yodhula Charitra మాల కులం పేరు - దా...
-
History of Mala veerabahudu మాల కులం - చారిత్రక వీరత్వం మాలల వీరబాహుడు చరిత్ర మాల కులం అత్యంత ప్రాచీన కులాలలో ఒకటి. ఒకప్పుడు పాలకు...
-
Manda Krishna betrayed the Madiga Caste Manda Krishna betrayed the Madiga Caste మీ అందరికి తిండి, బట్ట, ఇల్లు, వైద్యం కల్పించడం ప్రభుత...
-
History of Mala Kannamadasu వీర భయంకర మాల కన్నమదాసు చరిత్ర మాల కులం - చారిత్రక వీరత్వం తెలుగు నేల మీద మాలల వీరత్వానికి, నిజాయిత...
Copyright ©
'మాలల' మల్ల యోధుల చరిత్ర | Powered by Blogger
Design by Flythemes | Blogger Theme by NewBloggerThemes.com
